ఎన్‌డీసీసీబీకి ఉత్తమ పనితీరు అవార్డు
- నాబార్డ్ 45వ జాతీయ వ్యవస్థాపక దినోత్సవం
- ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ
హైదరాబాద్, జూలై 16(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నాబార్డ్ 45వ జాతీయ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రంలోని సహకార బ్యాం కుల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీబీ)కు ‘ఉత్తమ పనితీరు అవార్డు’ ప్రదానం చేశారు.
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ నీలేష్ ద్వివేది చేతుల మీదుగా నిజామాబా ద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగభూషణం వందే, ఉప జనరల్ మేనేజర్ లింబాద్రి అందుకున్నారు. బ్యాంకు సాధించిన పురోగతి, రైతులకు, మ హిళా సంఘాలకు, స్వయం సహాయక బృం దాలకు, సహకార రంగ అభివృద్ధికి అందిస్తున్న సేవలను పలువురు అభినందించారు.






