19 June, 2026 | 4:00 AM

సొంతిల్లు ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది

19-06-2026 12:07 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ రూరల్ జూన్ 18: సొంతిల్లు ఆత్మగౌరాన్ని కాపాడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలో ఓబ్లాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గత ఏడాది మన నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఇండ్లు రానున్నాయని స్పష్టం చేశారు. పేదలకు సొంత ఇల్లు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల వరకూ చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, గ్రామ సర్పంచ్ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కుర్మయ్య, ఉప సర్పంచ్ చంద్రకళ, నాయకులు రామచంద్రయ్య, శ్రీనివాస్ యాదవ్, మాధవ రెడ్డి, రఘు నాయక్, మల్లు అనిల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, వెంకట్ రాములు, గోవింద్ యాదవ్, దాసు, కోడూరు రవి తదితరులు పాల్గొన్నారు.