19 June, 2026 | 5:22 AM

35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

19-06-2026 12:05 AM

మహబూబాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): అశోక్ లేలాండ్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట పోలీసులు మండల పరిధిలోని లోక్యా తండాలో పట్టుకున్నారు. ఎస్ ఐ వెం కన్న కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి.

ఇదే మండలం గోల్ బొల్క తండా గ్రామ శివారు దన్ సింగ్ తండా రేషన్ డీలర్ బాదావత్ ప్రమీల దగ్గర నకిరేకల్ కు చెంది న కాశం భద్రయ్య అనే వ్యక్తి 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఖరీదు చేసి లీలాండ్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నట్టు చెప్పా రు.

ఈ సంఘటనలో లారీ, బియ్యం స్వాధీ నం చేసుకొని రేషన్ బియ్యం ఖరీదు చేసిన భద్రయ్య, రేషన్ డీలర్ ప్రమీల, లారీ డ్రైవర్ గౌస్, వాహన ఓనర్ భాస్కర్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు. బి య్యం పట్టుకున్న ఘటనలో హెడ్ కానిస్టేబు ల్ బాలాజీ, పోలీస్ కానిస్టేబుళ్ళు ప్రవీణ్ మహేష్ పాల్గొన్నట్లు చెప్పారు.