14 March, 2026 | 11:40 PM

రూ.77.70 లక్షలతో అభివృద్ధి పనులు

14-03-2026 08:14 PM

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్,(విజయక్రాంతి): మామడ  మండలం న్యూ సాంగ్వి గ్రామంలో రూ. 20 లక్షలతో రెండు S. H. G. (VO) భవనాల నిర్మాణానికి, రూ. 20 లక్షలతో రెండు S.H. G(VO) వర్కింగ్ షెడ్ ల నిర్మాణానికి, రూ. 12 లక్షలతో అంగన్వాడి భవన నిర్మాణానికి రూ. 25.70  లక్షలతో స్కూల్ కాంపౌండ్ నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు తెలుసుకొని, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, గ్రామ సర్పంచ్ అశ్విన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొండ్ర రాజారెడ్డి, మండల అధ్యక్షులు రంజిత్, సీనియర్ నాయకులు బాపు రెడ్డి, సర్పంచ్ లు సూరి,  తిరుపతి, మల్లయ్య, సచిన్, రాజేశ్వర్, నాయకులు  ప్రవీణ్, రాజు, చిన్నారెడ్డి, రమణ, తో పాటు మామడ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.