22 May, 2026 | 4:39 PM

శ్రీ కృష్ణ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు

22-05-2026 03:35 PM

నిర్మల్ జిల్లా అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  ప్రజలతోపాటు  ఖానాపూర్ నియోజకవర్గ  ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని  కేరళ రాష్ట్రంలోని గురు వాయుర్లోని  కృష్ణ భగవానుడిని  కోరుకున్నట్లు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. గురువారం కుటుంబ సమేతంగా దేవుడికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గం అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.