ఎండ తీవ్రత నుండి జాగ్రత్త వహించండి
అవసరమైతే తప్ప బయటికి రావద్దు
అంబేద్కర్ యువజన సంఘ నాయకులు రాయల శ్రీనివాస్
కారేపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మండల ప్రజలకు అంబేద్కర్ యువజన సంఘ నాయకులు రాయల శ్రీనివాస్ ఎండల ప్రభావం నుండి జాగ్రత్త వహించి అవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ నాలుగు రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా వడగాలులు వస్తున్నాయని ప్రస్తుతం 45 నుంచి 50 డిగ్రీల మధ్య ఎండ తీవ్రత నిప్పుల కొలిమిలా మారాయని, ఎండలు విపరీతం గా ఉందని ప్రజలు అవసరం ఉంటే తప్పా బయటకు రావద్దని తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్ళినప్పుడు టోపీ, టవల్ తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని అదేవిధంగా వారం రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కావున పనుల కోసం బయటకు వస్తున్న ప్రజలు తీవ్ర ఎండలకు వడదెబ్బకు గురవుతున్నారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేసి రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు,మజ్జిగ కేంద్రాల ఏర్పాటు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ వంటి కనీస రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రజలు ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడానికి కనీస వసతులు ఏర్పాటు చేయాలని అంబేద్కర్ యువజన సంఘ నాయకులు రాయల శ్రీనివాస్ ప్రకటన ద్వారా తెలిపారు.






