మాలి సంఘం బలోపేతానికి కృషి చేస్తా
వాంకిడి మండల అధ్యక్షుడిగా వాడై బాబురావు బాధ్యతలు స్వీకారం
వాంకిడి,(విజయక్రాంతి): మాలి సంక్షేమ సంఘం వాంకిడి మండల అధ్యక్షునిగా వాడై బాబురావు ఎన్నిక కావడంతో సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాడై బాబురావు మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి మండల అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మాలి సంఘం ఐక్యత, అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంఘ సభ్యుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి యువతకు ప్రోత్సాహం అందించే దిశగా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, సంఘ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.






