నిరాశ్రయులకు పోలీసుల అండ
నిర్మల్,(విజయక్రాంతి): గత నాలుగు ఐదు రోజులుగా తీవ్ర ఎండల కారణంగా నిర్మల్ పట్టణంలో రోడ్లపై, బస్టాండ్లలో నివసిస్తున్న నిరాశ్రయ భిక్షాటనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకోలేక పలువురు మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన నిర్మల్ పోలీసులు, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిన్న రాత్రి నిర్మల్ పట్టణంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బస్టాండ్లు మరియు ప్రజా ప్రదేశాల్లో ఆశ్రయం లేకుండా జీవిస్తున్న భిక్షాటనదారులను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందించారు.డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్మల్ టౌన్ పోలీసులు కొంతమంది నిరాశ్రయులను ఓల్డ్ ఏజ్ హోంకు తరలించి, వారికి ఆహారం, ఆశ్రయం అవసరమైన సంరక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు.






