22 May, 2026 | 4:46 PM

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు

22-05-2026 03:53 PM

అబ్దుల్లాపూర్ మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ఆఫీసులో ఏసీబీ సోదాలు  కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇంట్లో  ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అందులో ఆదాయానికి మించి  ఆస్తులు ఉండడం, పలు ప్రాంతాలలో భూములు, ప్రభుత్వ భూములు కాజేసినట్లు బట్టబయలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లీపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 8 ఎకరాలు భూమి కొనుగోలు చేసినట్లు తేలింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో  అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్  ఆఫీసులో అధికారులు తనిఖీలు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని తనిఖీలు రేపటినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.