ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఐటీడీఏ ఏపీవో జనరల్ వసంతరావు జాదవ్
ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రభుత్వాలు తీసుకువచ్చే సంక్షేమ పథకాలను గిరిజనులు, ముఖ్యంగా ఆదివాసి ఆదిమ తెగల గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటిడిఏ ఏపీవో జనరల్ వసంతరావు యాదవ్ అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెరా, శంకర్ గూడా గ్రామపంచాయతీలో జన జాతీయ గ్రామ ఉత్సవ్ మరియు జన్ భాగీ దారి అభిహాన్ లో భాగంగా రెండు పంచాయతీల్లో సమగ్ర ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాల్లో పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సూచనలు చేశారు. ఆయనతోపాటు ఏపీవో ( పి వి టి జి ) ఆత్రం భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు జిల్లా అధికారి డాక్టర్ మనోహర్ ల తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామ సభలకు సర్పంచ్ మెస్రం భీమ్ రావు, రోమా లు అధ్యక్షత వహించారు.






