22 May, 2026 | 5:16 PM

SRH vs RCB హైఓల్టేజీ మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా

22-05-2026 04:01 PM

హైదరాబాద్: బ్లాక్‌ టికెట్‌ మాఫియా(IPL Ticket Black Marketing Racket ) ఉప్పల్‌ వేదికగా RCB వర్సెస్‌ SRH(Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad) హైఓల్టేజీ మ్యాచ్‌ను క్యాష్ చేసుకుంటోంది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. SRHకు హోంగ్రౌండ్ ఉప్పల్ లో ఇవాళే చివరి మ్యాచ్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

మ్యాచ్ టికెట్లకు డిమాండ్ బాగా పెరిగిపోవడంతో ఓ ముఠా బ్లాక్ లో అమ్ముతోంది. రూ.1500 నుంచి రూ. 8 వేలకు పైగా అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టేడియంలో వీవీపీ బాక్స్ టికెట్లకు రూ. లక్షలు చెప్తున్నట్లు సమాచారం. స్టేడియం పరిసరాల్లో తిరుగుతూ యువకులు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. సీపీ సుమతి ఆదేశాలతో బ్లాక్ టికెట్ల విక్రయంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎస్ వోటీ పోలీసులు ఐపీఎల్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందాపై నిఘా పెట్టింది. నలుగురి నుంచి 5 డిజిటల్ టికెట్లను ఎస్ వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకులను ఉప్పల్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్ వోటీ పోలీసులు తెలిపారు.

హైఓల్టేజీ మ్యాచ్‌.. క్యాష్ చేసుకుంటున్న బ్లాక్‌ టికెట్‌ మాఫియా

హైఓల్టేజీ మ్యాచ్‌ 39 వేల టికెట్లను 3 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. డిస్ట్రిక్‌ యాప్‌లో బోర్డ్‌ 3 నిమిషాల్లోనే సోల్డ్‌ఔట్‌ బోర్డు పెట్టేసింది. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌ టికెట్‌ మాఫియా డిస్ట్రిక్‌ యాప్‌లో ముందే పెద్ద సంఖ్యలో టికెట్లు కొన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌ మార్కెట్‌లో కళ్లు చేదిరే  రేట్లకు టికెట్లు విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకుని రంగంలోకి దిగిన సైబర్‌ నేరగాళ్లు నకిలీ యాప్‌ క్రియేట్‌ చేసి నకిలీ టికెట్ల విక్రయిస్తున్నారు.