calender_icon.png 22 February, 2026 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ ఎన్నికలు హామీ.. పెళ్లికి విరాళం

22-02-2026 06:41:03 PM

వదలపర్తి సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణను ఆదర్శంగా తీసుకోవాలి

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో హామీలో భాగంగా ఐదువేల రూపాయలు పెళ్లికి అందజేసినట్లు వదల్పర్తి గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వదలపర్తి గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మా నారాయణ మాట్లాడుతూ... మండలంలోని వదలపర్తి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గ్రామంలోనీ ఏ ఇంటిలోనైనా ఆడ కూతురుకు పెళ్లి జరిగితే రూ.5000 ఇస్తానని చెప్పిన హామీ ప్రకారం చాకలి సాయిలు కూతురు పెళ్లికి 5000 రూపాయలు కట్నం ఇవ్వడం జరిగిందని గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ తెలిపారు.

దీనితో గ్రామంలో అందరూ ఐదువేల రూపాయలు పెళ్లికి ఇవ్వడంతో ఆశ్చర్యానికిలోనై అభివందనాలు తెలియజేశారు.ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎందరో గెలవాలని మాట ఇచ్చి తప్పుతారు తప్ప ఇలా మాట మీద ఉండి పెళ్లికి 5000 రూపాయలు ఇవ్వడం ఎంతో గొప్ప అని గ్రామస్తులు తెలిపారు.ఇలాగే సమాజంలో అందరూ ఉంటే ప్రజాస్వామ్యంతో పాటు ప్రజలు ఎందరో బాగుపడతారన్నారు.వదలపర్తి సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణను అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ,గ్రామస్తులు పాల్గొన్నారు.