26 May, 2026 | 4:27 AM

ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల

26-05-2026 12:18 AM

బాన్సువాడ, మే 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యాలయం ( AౄA ) లో ఆత్మ కమిటీ చైర్మన్,సభ్యుల పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజులు హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ గా మాసాని రవీందర్ రెడ్డి,కమిటీ సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసుల బాలరాజులను నూతన కమిటీ సభ్యు లు సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, ఎజాజ్, నార్ల సురేష్,అబ్దుల్ ఖాలేఖ్, గురు వినయ్ కుమార్ నార్ల సురేష్, మధుసూదన్, యండి. దావూద్, మాజీద్, బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండల, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు పాల్గొన్నారు.