26 May, 2026 | 4:45 AM

రీయింబర్స్‌మెంట్స్‌పై స్పష్టత ఏది?

26-05-2026 12:18 AM
  1. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 
  2. నేడు హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం 

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఆ తర్వాతనే విద్యార్థుల కౌన్సెలింగ్ నిర్వహించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టత లేకుండానే ఈ నెల 27నుంచి ప్రభుత్వం కౌన్సిలింగ్ చేపట్టడం సరికాదన్నారు. పాత పద్ధతి ప్రకారమే రీయింబర్స్ మెంట్ అమలు చేస్తామని ప్రకటించిన తర్వాతనే కౌన్సిలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు.

నాలుగు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా వ్యహరిస్తుందన్నారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్ అంశంపై మంగళవారం హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.