26 May, 2026 | 3:41 AM

బస్తీ దవాఖానల్లో వైద్యుడిని నియమించాలి

26-05-2026 12:17 AM

ఖైరతాబాద్, మే 25(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ డివిజనులోని ఇందిరానగర్ లో ఉన్న బస్తీ దవాఖానలో గత రెండు నెలలుగా వైద్యుడు లేరు. దీంతో వైద్యం నిమిత్తం అక్కడకు వచ్చే స్థానికులు ఇబ్బందులు పడుతు న్నారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవ ర్ధన్ రెడ్డి సోమవారం స్పందించారు. బస్తీ దవాఖానాను స్థానికులతో కలిసి సందర్శించారు.

సమస్య విషయమై సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇందిరానగర్ బస్తీ దవాఖానలో వైద్యుడిని తక్షణమే నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు పెరిక కిరణ్ బాబు, నాయకులు బాబు గౌడ్, కొండల రావు, దీపక్, విక్కీ, పుంటి సాయి, నయీం, ప్రేమ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.