1 May, 2026 | 9:41 PM

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

01-05-2026 08:31 PM

బోయినపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభం పెళ్లి హమ్లెట్ గ్రామమైన చంద్రగిరి పల్లిలో ఇందిరమ్మ పథకం కింద మంజూరై నిర్మాణం పూర్తయిన నూతన ఇంటిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన గృహం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి అధికారులు ఉన్నారు.