11 May, 2026 | 9:58 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె

11-05-2026 09:09 PM

దమ్మపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్కని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎంఎల్ఎ జారే తీసుకెళ్లారు. 

గ్రామీణ రహదారుల అభివృద్ధి తాగునీటి సమస్యలు పంచాయతీలకు అవసరమైన మౌలిక వసతులు మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల అమలు గ్రామీణాభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరగా మంత్రి సీతక్క సమస్యలను సానుకూలంగా పరిశీలించి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎం ఎల్ ఎ జారే పేర్కొన్నారు.