31 July, 2026 | 8:19 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

గీతన్నల రాష్ట్ర చైతన్య బస్సు యాత్ర, గోడ పోస్టర్‌ ఆవిష్కరణ

31-07-2026 07:01 PM

తుంగతుర్తి (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం  ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న "అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర" రాష్ట్ర బస్సు యాత్ర పోస్టర్‌ను శుక్రవారం మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు పులుసు వెంకటనారాయణ గౌడ్,  మద్దెల నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... గీత కార్మికులకు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రూ.4వేల పెన్షన్, ప్రమాద మరణ ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంపు, 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు పెన్షన్ అలాగే వృత్తి నిర్వహించే ప్రతి గీత కార్మికుడికి కాటమయ్య రక్షణ కవచం వంటి సంక్షేమ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేసి గీత కార్మిక కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.