31 July, 2026 | 8:18 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

మా పాఠశాలలో ప్రతి విద్యార్థి పర్యావరణ ప్రేమకు ప్రతీక

31-07-2026 07:06 PM

జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు నివేదిత

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నివేదిత తన సొంత ఖర్చులతో పాఠశాలలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నివేదిత మాట్లాడుతూ... మా పాఠశాలలో ప్రతి విద్యార్థి పర్యావరణ ప్రేమకు ప్రత్యేకగా కొనసాగుతున్నారని ఆమె తెలిపారు.

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క భవిష్యత్ తరానికి పచ్చని భవిష్యత్తు అవుతుందని పచ్చని ప్రకృతిని కాపాడి పచ్చని ప్రపంచాన్ని అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.