అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ లో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను శుక్రవారం మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ... రాఘవేంద్ర నగర్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్ , నాయకులు ఉల్లి ఆంజనేయులు, బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, బొక్క సత్తిరెడ్డి, బొక్క సుధాకర్ రెడ్డి, కడపోల్ల రాజు, మామిళ్ళ మల్లేష్ యాదవ్, అందెల సాయి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






