31 July, 2026 | 6:18 PM

నల్లగొండ చౌరస్తా వద్ద ప్రమాదకర గుంతలు

31-07-2026 06:02 PM

- వెంటనే పూడ్చాలని కౌన్సిలర్ల వినతి

ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 22, 8వ వార్డులలో నల్లగొండ చౌరస్తా దగ్గర, న్యూ రామ్ నగర్ వెళ్లే మలుపు వద్ద ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయని, వాటిని వెంటనే పూడ్చాలని కౌన్సిలర్లు జాలిగం విఘ్నేష్, తాహెరా బబ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు R&B DEE కి వినతిపత్రం అందజేశారు.

రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల రోజూ స్కూల్ కు వెళ్లే చిన్నారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై DEE  సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు కౌన్సిలర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జాలిగం విఘ్నేష్, తాహెరా బబ్లు తో పాటు నాయకులు కొల్తూరి కిషోర్ పాల్గొన్నారు.