31 July, 2026 | 8:18 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటుచేసుకోవాలి

31-07-2026 07:18 PM

పెద్దపల్లి డిఎల్పిఓ దేవకిదేవి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని పెద్దపల్లి డిఎల్పిఓ దేవికి దేవి అన్నారు, శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో  నీలగిరి దివ్య దర్శన్ రావు అధ్యక్షతన మండల  పరిధిలోని  సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో జలసిరి కార్యక్రమము, పారిశుద్ధ్య  కార్యక్రమాలపై తగు సూచనలు చేశారు, జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తోపాటు  ప్రతి హ్యాండ్ బోర్ వద్ద కమ్యూనిటీ ఇంకుడు గుంత అలాగే ప్రతి గ్రామానికి 5 పంట కుంటలు తప్పకుండా నిర్మించాలని దేవకీదేవి  అన్నారు, అలాగే గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు గ్రామాలలో ఎక్కడైనా నీరు నిలువ ఉండి పారిశుధ్య సమస్యలు ఏర్పడితే వాటిపై తగు చర్యలు తీసుకోవాలని ఎక్కడ కూడా మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలని, దోమల బెడద లేకుండా క్రమము తప్పకుండా ఫాగింగ్ చేయించాలని  సర్పంచులకుసూచించారు.