11 May, 2026 | 9:59 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

11-05-2026 09:06 PM

బొడ్డు బాలకృష్ణ  దశదిన కర్మకు హాజరైన వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): కార్మిక దినోత్సవంన నోస్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో  రియాక్టర్ పేలి మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబాన్ని  ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం పరామర్శించారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన బొడ్డు బాలకృష్ణ  మే 1న న్యోష్ ల్యాబ్ కంపెనీలో ప్రమాదవశాత్తు మరణించగా వారి దశదిన కర్మ కార్యక్రమంకు ఆయన హాజరై  బాలకృష్ణ  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.