సహాయక చర్యల్లో యూత్ కీలక పాత్ర
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలువురి ఇండ్లలోకి వరద నీరు చేరింది. ఊత్కూర్ యూత్ నాయకులు వరదలో ఇబ్బందులు పడ్డ వారికి సహాయ చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ యూత్ అధ్యక్షులు మారిశెట్టి సుమన్ స్థానిక యూత్ సహకారంతో బాధితులకు అండగా నిలిచారు. పోచమ్మ గుడి వద్ద నుంచి వరద ప్రవాహం అధికంగా రావడంతో కాలనీలోని కొందరి ఇండ్లలోకి నీరు చేరింది.
సొంతంగా జేసీబీ ఏర్పాటు చేసి వరద ప్రవాహంతో ఇండ్లు దెబ్బతినకుండా రాత్రి 12 గంటల వరకు డ్రైనేజీలో పేరుకుపోయిన పూడికను తొలగించారు. ప్రతి ఏడాది తొమ్మిదవ వార్డులో వరద నీటితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వరద సహాయక చర్యల్లో యూత్ నాయకులు వంశీ, రమేష్, దేవేందర్, రాయలింగు, బన్నీ, జనార్దన్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.






