3 June, 2026 | 2:52 AM

ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేసిన ఎమ్మెల్యే జారె

03-06-2026 12:09 AM

దమ్మపేట, జూన్ 2, (విజయక్రాంతి):  మండల కేంద్రంలో కార్పెంటర్ కాలనీ నందు గతంలో విద్యుత్ ప్రమాదంలో అకాల మరణం చెందిన రంగు కోకిల కుటుంబానికి విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన ఐదులక్షల రూపాయల ఎక్స్ గ్రేషియ చెక్కును అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కక్కిరాల రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, స్థానిక సర్పంచ్ పగడాల రమాదేవి, ఉపసర్పంచ్ ఆంగోత్ శ్రీనివాసరావు, చిన్నశెట్టి యుగంధర్, అన్నవరపు నాగేంద్ర, వార్డు మెంబర్లు పోలమ్మ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.