ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనే పరమావధిగా పనిచేస్తాం
తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం
జయశంకర్ విగ్రహావిష్కరణలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి
వనపర్తి టౌన్, జూన్ 2 : ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన కలలు కన్న స్వప్నాలను సాకారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి నిమిషం పనిచేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం వనపర్తి పట్టణం లోని మెడికల్ కళాశాల చౌరస్తాలో ఏర్పాటుచేసిన జయశంకర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన ఎందరో యువకుల కుటుంబాలను సైతం గుర్తుంచుకొని వారికి చేదోడు వాదోడుగా నిలబడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గత పాలకులు తెలంగాణ విప్లవగలం గద్దర్ ని ఎన్నో రకాలుగా అవమానపరిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కూతురు వెన్నెలమ్మకు సముచిత స్థానాన్ని కట్టబెట్టి గౌరవించుకుంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకొని జై తెలంగాణ అంటూ నిమదించిన శ్రీకాంతాచారి తల్లికి మహిళా కమిషన్ సభ్యురాలుగా స్థానం కల్పించి గౌరవించుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవీరమే పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కదిరే రాములు వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు యువకులు పాల్గొన్నారు






