27 July, 2026 | 8:57 PM

పారిశుధ్య సిబ్బందికి రైన్ కోట్ల పంపిణీ

27-07-2026 08:14 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ సిబ్బందికి సోమవారం సాయంత్రం ఎంపీడీవో రమేష్ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ చేతుల మీదుగా రైన్ కోట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది సేవలు అభినందనీయమని వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం పనులు చేపట్టేందుకు వీటిని అందిస్తున్నామన్నారు. పట్టణంలో సిబ్బంది ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రంగా ఉండే విధంగా విధులు నిర్వహించాలని కోరారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్ ,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్ ,ఏపీ ఓ జగ్జీరావు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.