ఓటర్ మ్యాపింగ్ స్పెషల్ డ్రైవ్
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఈనెల 28 నుండి ఆగస్టు ఒకటి వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 'సర్' ప్రోగ్రాం పై సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ ఇప్పటివరకు మున్సిపల్ లో 80 శాతానికి పైగా ఓటర్ మ్యాపింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.అధికారులు, బీఎల్ఓ లు, సిబ్బంది, కౌన్సిలర్లు సమిష్టిగా కృషిచేసి నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలన్నారు.ఇంటింటికి వెళ్లి లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, తహసిల్దార్ బసిరుద్దీన్, కమిషనర్ రమేష్ ,ఎంపీడీవో దివ్యదర్శను రావు,కౌన్సిలర్ లు, బిఎల్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.






