27 July, 2026 | 9:13 PM

గత ప్రభుత్వ అలసత్వం వల్లనే గ్రామంలో పరిశుభ్రత లోపించింది

27-07-2026 08:35 PM

నూతనకల్,(విజయక్రాంతి): మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో గత ప్రభుత్వాల అలసత్వం వల్లనే పారిశుద్ధ్యం క్షీణించి, గ్రామంలో పరిశుభ్రతా లోపించిందని మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దశాబ్ద కాలంగా పేరుకుపోయిన మురుగు సమస్యపై గ్రామస్థులు తమ దృష్టికి తీసుకురావడంతో ఆయన తక్షణమే స్పందించి పూడుకుపోయిన కాలువలను స్వయంగా శుభ్రం చేయించారు.​ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గత పాలకులు పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదలడం వల్లే గ్రామంలో మురికి కాలువలు నిండిపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో  గ్రామ కాంగ్రెస్ నాయకులు అనంతుల మధు, వేల్పుల పల్లా లింగయ్య, కొమ్ము రవీందర్, కాట్ల మాస్, కొంపెల్లి కళ్యాణ్, జాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.