డీఏ, పీఆర్సీ మంజూరు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం: పీఆర్టీయుటీఎస్
27-07-2026 08:26 PM
గణపురం,(విజయక్రాంతి): ఒకటో తేదీలోగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డిఏలు, పిఆర్సీ మంజూరు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ హెచ్చరించారు. గణపురం మండలంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిఏలను వెంటనే మంజూరు చేయాలని, పిఆర్సీ నివేదికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులను అన్ని పెద్ద ఆసుపత్రుల్లో అమలు చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.






