ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
పీఆర్టీయూ టీఎస్ నాయకులు
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వేసవి సెలవుల్లో జనగణన (సెన్సస్) విధులు, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని పీఆర్టీయూ టీఎస్ నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం విధులు నిర్వహించిన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆర్జిత సెలవులు ఇవ్వాలని, పీఎం శ్రీ పాఠశాలల్లో నిర్వహించిన సమ్మర్ క్యాంపులకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
అలాగే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను నివారించేందుకు వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, డీఎస్సీ–2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సేవలను పునరుద్ధరించి వారి వేతనాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునార్కర్ అనిల్ కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రవిశంకర్, మహిళా ఉపాధ్యక్షురాలు గురువంత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






