నర్సాపూర్ లో విత్తన మేళా
27-07-2026 08:24 PM
ఆరుతడి పంటల సాగుకు రైతులకు సూచనలు
నర్సాపూర్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సాపూర్ రైతు వేదికలో సోమవారం నిర్వహించిన విత్తన మేళాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడి సంధ్యారాణి మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు జొన్న, కందులు, మినుములు, పెసర్లు, కూరగాయలు వంటి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎఆర్‌ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ ఆరుతడి పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు, నానో యూరియా, నానో డీఏపీ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి దీపిక, వ్యవసాయ విస్తరణ అధికారులు, విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు.






