13 July, 2026 | 1:10 AM

ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

13-07-2026 12:08 AM

కుబీర్ జులై 13 (విజయ క్రాంతి) తాండూర్ మండలంలోని ముసలిగా తండాలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ళను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం కింద ను మంజూరు చేస్తుందని తెలిపారు. గుడిసెలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఐదు లక్షల ఖర్చు చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.