3 August, 2026 | 1:43 AM

భానూరు ధన మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్

03-08-2026 12:29 AM

పటాన్చెరు, ఆగస్టు 2: పటాన్చెరు మండలం భానురు గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ధనమైసమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో అమ్మ వారిని దర్శించుకుని..ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అమ్మ వారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోపాల్, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.