ప్రతి అక్షరంలోనూ కర్నె రవి బతికే ఉంటాడు
03-08-2026 12:30 AM
కర్నె రవిచరణ్
సంస్థాన్ నారాయణపూర్,ఆగస్టు 2 : ప్రజల పక్షాన కొట్లాడే గొంతుకై నిలిచి తన క లంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కలం యోధుడు కర్నె రవి ప్రతి అక్షరంలోనూ బతికే ఉంటాడని కర్నె రవిచరణ్ అన్నారు.ఆదివారం నారాయణపూర్ మండలకేంద్రంలో జర్నలిస్టు కర్నె రవి 31వ వర్ధం తి సందర్భంగా స్మారక స్థూపంవద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన రవి నేటి తరానికి ఆద ర్శమని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాచకొండ రవి,పాశం కృష్ణ,తెలం గాణ బిక్షం,ఉప్పు కృష్ణ,సతీష్,ప్రభాకర్,ర ఘు, మధు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.






