10 March, 2026 | 12:05 AM

ఎమ్మెల్యే పుర చైర్మన్ కు ఘన సన్మానం

08-03-2026 04:14 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయి మున్సిపల్ చైర్‌పర్సన్  ఎండి రిహానా బేగంని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళా సాధికారతకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జాయింట్ కన్వీనర్ శ్రీ మెరిపే సురేష్, తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీ ఎస్‌కే ఖాజా మొహిద్దీన్, తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ సెక్రటరీ శ్రీ ఎం. గిడ్డయ్య, ఖమ్మం జిల్లా జాయింట్ కన్వీనర్ శ్రీ బి. శ్రీనివాసులు, ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఎం.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులను సత్కరించడం సంతోషకరమని వారు తెలిపారు.