9 March, 2026 | 9:10 AM

మహిళా పోలీస్ సిబ్బందిని సన్మానించిన డిఎస్పి శివరాం రెడ్డి

08-03-2026 04:18 PM

చిట్యాల,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందికి డిఎస్పి శివరాం రెడ్డి ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నల్గొండ డి.ఎస్.పీ శివరాం రెడ్డి  ఆధ్వర్యంలో నార్కెట్‌పల్లి, చిట్యాల పోలీస్ స్టేషన్‌ల మహిళా పోలీస్ సిబ్బందికి శాలువా కప్పి, కేక్ కట్ చేయించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... మహిళా పోలీస్ సిబ్బంది విధుల పట్ల చూపుతున్న కర్తవ్యనిష్ఠ, ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  నార్కెట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి, చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ మరియు ఇరు పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది పాల్గొన్నారు.