6 May, 2026 | 1:34 AM

రాష్ట్రంలో కరప్షన్ కమిషన్ల పాలన సాగుతోంది...

06-05-2026 12:16 AM

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే ధన్ పా...

ఆదిలాబాద్, మే 5 (విజయక్రాంతి): తెలంగాణలో బీజేపీ ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంతో ఈనెల 10వ తేదిన హైదరాబాదు రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి వెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని నిజాబామాద్ ఎమ్మెల్యే, బహిరంగ సభ జిల్లా ఇన్చార్జి ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు.

మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆయన మాట్లాడారు... మూడవ సారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ బహిరంగ సభకు మూడు లక్షలకు వైగా ప్రజలతో స్వాగతం పలికేలా పార్టీ ప్రణాళిక రూపొందించిందన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో అవినీతి పాలన సాగగా రేండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కరప్షన్ -కమిషన్ ల పాలన సాగుతోందని ఆరోపించారు.

పన్నెండేళ్ల క్రితం దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉండగా ప్రధాని మోదీ సంస్కరణలు, ఆర్థిక విధానాలతో ప్రస్తుతం మూడవ స్థానం నుంచి రెండవ స్థానానికి ఎగబకుతోందన్నారు.సబ్ కా సాత్... సబ్ కా వికాస్... సబ్ కా విశ్వాన్ నినాదంతో ముందుకు సాగుతున్న మోడీ ప్రభుత్వం భారత్ ను ప్రపంచానికి విశ్వగురువుగా నిలుపుతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు బిజెపివై విషం కక్కాయని.. కానీ ప్రజలు వారికి చెంపపెట్టులాంటి ఫలితాలనిచ్చారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ... ఇటీవల ఐదు రాషాల్లో ఎన్నికల్లో విజయంతో బీజేపీ మరింత బలపడిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణాలోనూ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. 10వ తేదిన నిర్వహించే ప్రధాన మంత్రి సభకు ప్రతి పోలింగ్ బూత్ నుంచి బీజేపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

ఇటీవల పార్లమెంట్లో లో ప్రవేశ వెట్టిన మహిళా బిల్లును వ్యతిరేకించిన మమత బెనర్జీ, స్టాలిన్ లకు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పారని అన్నారు. సీఎం హోదాలో దేశాన్ని విచ్చిన్నం చేసేలా దేశ అస్తిత్వాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన స్టాలిన్, మమత బెనర్జీలను ఎమ్మెల్యేలుగా గెలవకుండ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్ప అద్యక్షుడు బ్రహ్మానంద్, బీజేపీ నాయకులు లాలా మున్నా, జోగు రవి, బోడిగం శ్రీకాంత్, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.