6 May, 2026 | 1:30 AM

రాష్ట్రంలో ప్రజా వంచన పాలన సాగుతోంది

06-05-2026 12:14 AM
  1. పూడూరులో రైతుల ధర్నాతో అధికారుల్లో చలనం వచ్చింది
  2. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి 

జగిత్యాల, మే 5 (విజయక్రాంతి): రాష్టంలో ప్రజావంచన పాలన సాగుతోందని,నిన్నటి వరకు సోయి లేదు..పూడూరు లో రైతుల ధర్నా తో అధికారుల్లో చలనం వచ్చిందని మాజీ మంత్రి బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల బి ఆర్ ఎస్ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రైతులు మద్దతు ధర రాకపోవడంతో పాటు కనీసం  ధాన్యం కొనుగోలు కూడా చేయడం లేదని కడుపు మండి రోడ్డు ఎక్కారు.

గతేడాది జగిత్యాలలో 4 లక్షల ధాన్యం సేకరణకు  1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 20 వేలు క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. నిజామాబాద్ లో 7 లక్షల లక్ష్యం అయితే 4 లక్షలు కొనుగోలు చేశారు.వరి ధాన్యం, మొక్క జొన్న కొనుగోలు కు కనీసం ముందస్తు ప్రణాళిక లేదన్నారు.రైతు లు రోడ్డు ఎక్కడానికి కారణం మీరు కాదా అని నిలదీశారు.గత ప్రభుత్వం పరిమితి పై ఆంక్షలు లేకుండా కొనుగోలు చేశారు.

రెండు వారాలు గడుస్తున్న మొక్క జొన్న ఎక్కడికక్కడ నిల్వ ఉందని,గత ప్రభుత్వంతో పోలిక ఏమిటి.రైతు బంధు పది వేలు ఇచ్చారు.రేవంత్ రెడ్డి చెబితే ప్రజలు నమ్మరు అని రాహుల్ గాంధీ తో డిక్లరేషన్ చేపిస్తే మూడు పంటల రైతు భరోసా ఎగ్గొట్టారని గుర్తు చేశారు.రుణ మాఫీ సగం ఎగ్గొట్టారు.పంటల బీమా అమలు కుకేంద్ర ప్రభుత్వం 25 శాతం తోరాష్ట్ర ప్రభుత్వం 25 శాతం ప్రీమియం చెల్లించలేక పంటల బీమా అమలు లేదు.

ఉన్నది మాట్లాడితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ మాట్లాడుతూ.... కల్లాలలో ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని జీవన్ రెడ్డి తో కల్సి రైతులతో ధర్నా చేస్తే, మహిళా రైతుల పై దాడి చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.జీవన్ రెడ్డినీ కూడా ఇడుచుకెళ్లారు.

మీరు పోలీసుల కాంగ్రెస్ కార్యకర్తల అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభించిన కొనుగోలు చేయకపోవడంతో రైతులు నిన్న ధర్నా చేస్తే జిల్లా మంత్రి కి సోయి వచ్చి  కలెక్టర్ తో సమావేశం అయ్యారు.ఈ కార్యక్రమం లో  మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత,మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు,ఆయిల్నేని వెంకటేశ్వర రావు, శీలం ప్రవీణ్ కుమార్, పాల్గొన్నారు.