11 March, 2026 | 9:26 PM

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

11-03-2026 07:32 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామంలో బుధవారం పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఉపాధి హామీ పథకం కింద రూ.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించడంతో పాటు కొత్తపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం గ్రామానికి చెందిన కొండూరు బిక్షం ఇల్లు విద్యుత్ ఘాతంతో కాలిపోవడంతో బాధిత కుటుంబాన్ని సందర్శించి వారిని పరామర్శించి తక్షణసాయంగా 10,000 ఆర్థిక సాయం అందజేశారు.

ప్రభుత్వ పరంగా  వచ్చే నష్టపరహారాన్ని వెంటనే అందించాలని అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటేశ్వరరావు, పిఆర్ ఏఈ  వరలక్ష్మి, రుద్రారం సర్పంచ్ షేక్ భాను బేగం, మాజీ ఎంపీటీసీ ఆవుల రజిత దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బొడ్డు మల్లయ్య, ఉప సర్పంచ్ చిమ్మట జ్యోతి, పంచాయతీ కార్యదర్శి బంటు సైదులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.