అవినీతిపై రాజీలేని పోరాటం: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
28-08-2026 12:21 AM
జడ్చర్ల: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై కచ్చితంగా పోరాడుతుందని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. జడ్చర్లలో కాంగ్రెస్ కార్యకర్త ఆనంద్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు తనను ఎవరూ ఫోన్ చేసి పిలవలేదని స్పష్టం చేశారు. తాను మహిళలను ఎప్పుడూ గౌరవిస్తానని, వారిని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారం కోసం అవసరమైతే దీక్షకు కూడా సిద్ధమని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు.






