25 March, 2026 | 1:37 PM

Breaking News

పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •  

సోమశిల ఆలయంలో అపశృతి

25-03-2026 12:12 PM

ధ్వజస్తంభం విరిగిపోవడంతో భక్తుల్లో ఆందోళన.

కొల్లాపూర్ రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో శ్రీ వీర అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో(Sri Veera Abhaya Anjaneya Swamy Temple) జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. మూడు రోజులుగా వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం ఆలయ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించే కార్యక్రమం జరుగుతున్న సమయంలో గజస్థంభం మధ్యలో విరిగిపోయింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా అయోమయంలో పడిపోయారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ విరిగిపోయిన ధ్వజస్తంభాన్ని మళ్లీ ప్రతిష్టించరాదని ఆచార పరంగా భావిస్తారని తెలిపారు. త్వరలోనే కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్ట కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు.