1 June, 2026 | 5:00 PM

వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం

01-06-2026 03:47 PM

నీటిపారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

 మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సామేలుతో కలిసి సందర్శించిన మంత్రి.

తుంగతుర్తి,(విజయక్రాంతి): వరి ధాన్యం సాగు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని, నీటిపారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి నల్ల మాస ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు తో కలిసి సందర్శించి, మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాలను ఏర్పాటు చేసి, 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ మద్దతు ధరకే కొనుగోలు చేశామన్నారు.

 రైతుల చివరి గింజ వరకు కొనుగోలు చేసినంతవరకు ప్రభుత్వం పని చేస్తుంది, రైతులు అధైర్య పడవద్దు అని పేర్కొన్నారు. యాసంగి పంటలో మొత్తం భారతదేశంలోనే తెలంగాణ  రాష్ట్రం నుంచి 63% కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. రైతులు ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ చేసిన ఘనత ప్రభుత్వానికి ఉందని అన్నారు. గడిచిన రెండున్నర సంవత్సర కాలంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ఒక్కొక్క పథకం, లబ్ధి చేకూర్చున్నాయి అన్నారు. సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టి, పేద ప్రజల గుండెల్లో మరిచిపోని విధంగా, రూపుదిద్దినట్లు, నేడు ప్రతి పేద కుటుంబం సన్న బియ్యం తింటుందని అన్నారు.

రామన్న రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి రెండో విడతలో 2500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కానున్నట్లు పేర్కొన్నారు. జూన్ 4 వరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో ప్రతి ధాన్యపు బస్తా, మిల్లులకు ఎగుమతి చేయవలసిన బాధ్యత అధికారులపై ఉందని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఎటువంటి బ్యాగుల కొరత లేదని, మిల్లులకు ధాన్యం ఎగుమతి చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల్ పవర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య,  ఏఐ సిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మార్కెట్ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్, మొరిశెట్టి నివేదిత, పిఎసిఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, గుడిపాటి సైదులు తాసిల్దార్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.