1 June, 2026 | 4:59 PM

జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు

01-06-2026 03:50 PM

బోథ్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బోత్ మార్కెట్ యార్డులో జొన్న పంట తూకం కోసం రైతుల మధ్య కొట్లాట జరిగింది. పంట తూకం వేయించడం పై అధికారుల పర్యవేక్షణ కురవడంతో అంగ బలం ఉన్నవారి దే పై చేయగా నిలుస్తున్నదని రైతులు వాపోతున్నారు . పంట తూకానికి తీసుకువచ్చి దాదాపు 15 రోజులు అవుతున్న తూకం వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని కొంతమంది రైతులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. సోమవారం రోజున పంట తూకం కోసం అవసరమైన కాంట తమ కంటే తమకు తూకం వేయాలని వాగ్వివాదానికి దిగారు.

దీంతో కొంతమంది రైతులు కాంటాను తీసుకొని తమ జొన్నల బస్తాల దగ్గరికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు దీంతో కాంటాను పట్టుకొని రైతులు అటూ ఇటూ వాదులు ఆడడంతో రైతుల చేతికి గాయాలయ్యాయి. పంట పండించి అమ్ముకుందామంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు అంటున్నారు. ప్రణాళికబద్ధంగా పంటను కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఉండవని మార్కెట్ పై అజమయిసి కోల్పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.