1 August, 2026 | 11:22 AM

ఉపాధి హామీ పథకం ఉద్యోగుల పెన్‌డౌన్ & షట్‌డౌన్ నిరసన

01-08-2026 10:14 AM

కూసుమంచి, ఆగస్టు 1: వీబీ-జీ రామ్ -జీ ఉపాధి హామి పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు( Employment Guarantee Scheme employees) పే స్కేల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ  రాష్ట్ర ఉద్యోగ సంఘం జేఏసీ  ఇచ్చిన పిలుపు మేరకు కూసుమంచి మండలం  ఉద్యోగులు పెన్‌డౌన్, షట్‌డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం ఉపాధి హామీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తూ, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిరంతరం సేవలందిస్తున్నప్పటికీ, తమకు తగిన వేతన శ్రేణి లేకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే  వీబీ-జీ రామ్ -జీ ఉపాధి హామి పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను పరిశీలించి  మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే వరకు శాంతియుతంగా తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని   ఉద్యోగులు స్పష్టం చేశారు.  ఈసీ కరుణ, టెక్నికల్ అసిస్టెంట్ నరేష్, హరి నాయక్, భవాని, శ్రీనివాస్, రవికాంత్, ఉద్యోగులు తులసీ పాల్గొన్నారు.