1 August, 2026 | 10:53 AM

ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ

01-08-2026 10:11 AM

మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్..పద్మ శంకర్

బెజ్జూర్ ఆగస్టు 01 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ చెండే పద్మ శంకర్ ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేశారు. మొక్కలు తీసుకుపోయిన ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాల్లో వాటిని నాటి సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. చెట్ల తోటే మానవాళికి మనుగడ లభిస్తుందని చెట్లను పెంపొందిస్తేనే సకాల వర్షాలు కురుస్తాయని స్వచ్ఛమైన గాలి లభిస్తుందని సూచించారు. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.