1 August, 2026 | 11:05 AM

హరీశ్‌రావు చొరవతో ఆర్థిక చేయూత

01-08-2026 10:10 AM

సిద్దిపేట రూరల్, ఆగస్టు 1: సీతారాంపల్లి గ్రామానికి చెందిన పడిగే రాజవ్వ మృతి చెందిన విషయం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish Rao) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన చొరవతో గ్రామ సర్పంచ్ చింతల రత్నాకర్ గౌడ్ చేతుల మీదుగా మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మిట్టపల్లి నాగరాజు, ఉప సర్పంచ్ మిట్టపల్లి సుధాకర్, వార్డు సభ్యులు, చింతల సాయి, మిట్టపల్లి నవీన్, గణపురం చంద్రం, పడిగే పరమేశ్వర్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.