1 August, 2026 | 10:06 AM

గోదావరి ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సీతక్క

01-08-2026 09:17 AM

మంగపేట, ఏటూరునాగారంలో మంత్రి సీతక్క పర్యటన

మంగపేట: మలుగు జిల్లా మంగపేట, ఏటూరునాగారంలో మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటించారు. గోదావరి ముంపు ప్రాంతాలను సీతక్క పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. మంగపేట మండలంలోని(Mangapet Mandal) కరకట్టను మంత్రి పరిశీలించారు. త్వరలోనే కొండాయి బ్రిడ్జి పూర్తి చేసి రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రవాణా సౌకర్యం లేని చోట్ల బూట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం(Godavari water level) పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలంలో స్నానఘట్టాలు, కల్యాణ కట్ట, విద్యుత్ స్తంభాలు వరదలో మునిగిపోయాయి.