16 April, 2026 | 7:40 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

జావేద్ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి తుమ్మల

16-04-2026 01:39 PM

ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని వేడుకుంటూ ఘన నివాళి 

ఖమ్మం,(విజయక్రాంతి): టీపీసీసీ సభ్యులు, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటి మాజీ అధ్యక్షులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao ), ఖమ్మం మేయర్ పూనకొల్లు నీరజ జావేద్ భౌతికకాయానికి నివాళులర్పించారు. సూర్యాపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జావేద్ భౌతిక కాయాన్ని గురువారం  ఖమ్మం రెడ్ హిల్స్ (వై.ఎస్.ఆర్ కాలనీ) లోని ఆయన ఇంటి వద్ద సందర్శించారు. ఈ సందర్భంగా జావేద్ కు ఘనంగా నివాళులర్పించడంతో పాటు కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. జావేద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని వేడుకున్నారు.

నివాళులు అర్పించిన సంభాని,  అన్వేష్ రెడ్డి

మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జావిద్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నాయకులు మద్ది శ్రీనివాస రెడ్డి, శైరీ, సాదు రమేష్ రెడ్డి, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు నివాళ్ళు అర్పించారు.