6 April, 2026 | 3:11 AM

అధైర్యపడకండి అండగా ఉంటా

06-04-2026 01:32 AM

చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల భరోసా 

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): వరంగల్ తూర్పు నియోజకవర్గం కొత్తవాడ చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య నేతృత్వంలో ఆదివారం జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హైదరాబాదులో కలిశారు. చేనేత పరిశ్రమకు సం బంధించిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్ షీట్లు కార్పెట్లు తదితర వస్తువులు టెండర్ ద్వారా కాకుండా నేరుగా సొసైటీల నుండి కొనుగోలు చేసే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.

ఈ విషయంలో చేత కార్మికులు అధైర్యపడకూడదని భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతున్నదని, చేనేత కార్మికులకు అండగా ఉం టుందని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లయన్ ఆడెపు రవీందర్, జిల్లా కోఆర్డినేటర్ వడ్నాల నరేందర్, కార్యదర్శి గోరంటల రాజు, చేనేత సొసైటీ ప్రతినిధులు, ఎలగం భద్రయ్య, మెరుగు చిన్న కొమురయ్య, మాచబత్తిని కుమారస్వామి, పంతగాని  శ్రీనివాస్ కొలిపాక మధునయ్య, ఆడేపు రవి, దువ్వెల రాజేందర్, ఎలగం సాంబయ్య, ఎలగం వెంకట మల్లు, ఆకునూరి జయరాజ్, పరికిపండ్ల కుమారస్వామి, బూర వేణుమాధవ్, కోడూరు రమేష్, అరిగొప్పుల సంపత్, పరికిపండ్ల రమేష్, పిట్ట రాములు, బేతి రమేష్, ఎలగం శ్రీనివాస్, ఎలగం కరుణాకర్, వలుస కిరణ్, ఎలుగం చిన్న వెంకట మల్లు, కోట మల్లయ్య, శామంతుల శంకర్ లింగం తదితరులు పాల్గొన్నారు.